కలం, వెబ్ డెస్క్ : తెలుగు భాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). దేశంలో వందల భాషలు ఉన్నా సరే 6 భాషలకే గుర్తింపు దక్కిందని.. అందులో తెలుగు ఉందన్నారు. గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ‘తెలుగు జాతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది. తెలుగు భాష గురించి గొప్పగా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు 10 కోట్ల మంది ఉన్నారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు’ అని చంద్రబాబు వివరించారు.
తెలుగు మాట్లాడటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించాలని.. కొత్త టెక్నాలజీతో తెలుగు భాషకు మరింత గుర్తింపు తీసుకురావాలన్నారు. ‘ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలో తెలుగు రాయడం చాలా ఈజీగా మారింది. రాయడం రాని వారికి వాయిస్ ద్వారా తెలుగులో అనుకున్నది రాసే ఛాన్స్ దొరికింది. కాబట్టి టెక్నాలజీని విరివిగా వాడుకుని.. తెలుగు భాషకు మరింత వన్నె తీసుకురావాలి. రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

Read Also: కోనసీమలో గ్యాస్ పైపు లీక్.. పరుగులు తీసిన స్థానికులు
Follow Us On: Pinterest


