కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహర్షి వాల్మీకి (Maharishi Valmiki) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) , మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డీఆర్వో స్రవంతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

