ధీమాక్ లేని దీవానా మాటలు మాట్లాడుతున్న కేటీఆర్: చామల

కలం, వెబ్ డెస్క్: తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే విష ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ధీమాక్ లేని దీవానా మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు 24 గంటలు రాజకీయాలే చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష పాత్రే పోషించాలని విమర్శలు మాత్రమే చేస్తుందని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ రోజు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని చామల (MP Chamala) మండిపడ్డారు. గడ్డం పెంచాను కాబట్టి.. ఏది చెపితే ప్రజలు ఆది నమ్ముతారని కేటీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వరకు ఎత్తిపోయాలంటే 93.5 మీటర్ల వరకు నీళ్లు ఉండాలని.. కానీ ప్రస్తుతం 89.20 మీటర్ల లెవెల్ వరకు మాత్రమే ఉందని చెప్పారు.మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో నీళ్లు ఎత్తిపోయాలనా.. ఉండాల్సిన లెవెల్ కు నీళ్లు లేవని అన్నారు. మేడిగడ్డ కింద దేవాదుల, సీతారాం ప్రాజెక్ట్ ఉందని. గ్రావిటీ ద్వారా తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ లకే వెళ్తుంది కదా! అంటూ చెప్పుకొచ్చారు.

సింగరేణి బొగ్గు, నీళ్లు, విద్యుత్ పై గత బీఆర్ఎస్ సర్కార్ కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే నేడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చామల దుయ్యబట్టారు. 150 ఏళ్ల తర్వాత ఎల్ నినో విపత్తు వచ్చిందని.. ప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దన్నారు. ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎల్ నినో(El Nino)పై అఖిలపక్ష సమావేశం ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశానికి అన్ని పక్షాలు వచ్చి తగిన సూచనలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Also Read : భారత్–ఈయూ ట్రేడ్ డీల్‌పై కీలక ముందడుగు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>