కలం, వెబ్ డెస్క్ : 2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు స్వయంగా హాజరైన వేళ ఈ తీర్పు వెలువడింది. దీంతో దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన ఈ కేసు విచారణ ముగియడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఈ వివాదం 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి ప్రారంభమైంది. బెంగళూరులో జరిగిన ఒక సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పేర్కొంటూ యూపీకి చెందిన బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న సుల్తాన్పూర్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ కేసులో భాగంగా 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోర్టులో లొంగిపోయి పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారులతో పాటు పలువురి సాక్ష్యాలను కోర్టు నమోదు చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం, రాహుల్ గాంధీపై మోపిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ ప్రత్యేక కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది.
Also Read : ట్రంప్‌కు షాక్.. బ్రెజిల్ అధ్యక్షుడిగా 80 ఏళ్ల లూలా రికార్డ్ విజయం!
Follow Us On: Youtube

