తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమాల్లో వర్ధిల్లాలి: బీర్ల ఐలయ్య

కలం, ఆలేరు: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఐలయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య అన్యోన్యత, సోదరభావం ఎల్లప్పుడూ నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత వేగంగా ముందుకు సాగాలని వేడుకున్నట్లు చెప్పారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నట్లు తెలిపారు. వర్షాలు పడి, ప్రకృతి అనుకూలించి రాష్ట్రాలు పాడిపంటలతో కళకళలాడాలని, రైతన్నలు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ముఖ్య నాయకులు, అనుచరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>