నిర్మల్‌లో సాగునీటి సంక్షోభం.. వరి పంటను కాపాడాలంటూ రైతుల వేడుకోలు!

కలం, నిర్మల్: సాగునీరు అందక వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో పెంబి (Pembi) మండల రైతులు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన (Farmers Protest) చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జూలైలో కురిసిన వర్షాలతో భీమన్న చెరువు నిండటంతో సుమారు 280 ఎకరాల్లో వరి పంట సాగు చేశామని తెలిపారు. అయితే సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోవడంతో చెరువులో నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోయిందని, పంటలకు నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి సరస్వతి కాలువ ద్వారా ఏల్కేరు వాగు ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని కోరారు. సాగునీరు అందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>