వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మురళీ కార్తీక్ ఫైర్

క‌లం, స్పోర్ట్స్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. కానీ తుది జట్టు ప్రయోగంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఇషాన్ కిషన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల సూర్యవంశీ (Vaibhav Suryavanshi )ని అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపారు. గత మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన ఈ యువ సంచలనం ఒత్తిడిలో కేవలం నాలుగు పరుగులకే నిష్క్రమించాడు. ఓపెనర్‌గా మాత్రమే అనుభవం ఉన్న కుర్రాడిని ఉన్నట్లుండి మిడిల్ ఆర్డర్‌లో పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ (Murali Kartik) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైభవ్ విఫలానికి మేనేజ్‌మెంట్ సరికాని వ్యూహమే కారణమని స్పష్టం చేశారు. చిన్న కుర్రాడిపై ఒత్తిడి పెంచడం సరైంది కాదని హితవు పలికారు. సీనియర్ బ్యాటర్ సంజూ శామ్సన్ మూడో స్థానంలో వచ్చి బాధ్యత తీసుకోవాల్సిందని కార్తీక్ అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ, వైభవ్ ఇద్దరూ ఓపెనర్లుగా ఒకే తరహా ఆటతీరు ఉన్నవారని చెప్పారు.

సీనియర్ కాబట్టి శామ్సన్ ఏ స్థానంలోనైనా సమర్థంగా ఆడగలరని తెలిపారు. ఒకవేళ మిడిల్ ఆర్డర్ కోసమే అయితే వైభవ్‌కు బదులుగా శివమ్ దూబేను ఆడించాల్సిందని పేర్కొన్నారు. మ్యాచ్ గెలిచినా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రతిభ రాబట్టాలంటే వారి సహజసిద్ధమైన స్థానాల్లోనే ఆడించాలని కార్తీక్ హితవు పలికారు.

Also Read : ప్రపంచకప్‌పై కన్నేసిన ఇంగ్లాండ్ స్టార్ బాంటన్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>