కాంగ్రెస్ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి: శివసేనా రెడ్డి

కలం, వనపర్తి: కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్‌ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి (Shiva Sena Reddy) పిలుపునిచ్చారు. సేవాదళ్‌ ఆధ్వర్యంలో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వనపర్తి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుండాలని కార్యకర్తలకు సూచించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రతి నెలా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో క్రమశిక్షణ, ఐక్యత, సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు గొర్ల జానకిరాములు, శ్రీను, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మండల అధ్యక్షులు నరహరి, రామ్‌రెడ్డి, సుల్తాన్‌, సుఖేందర్‌రెడ్డి, కోళ్ల వెంకటేష్‌, బి.కృష్ణ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, యాదగిరి, మన్యం, పాండు సాగర్‌, అనిల్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>