కలం, వెబ్ డెస్క్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport)లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వస్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా.. అతడి వద్ద సుమారు రూ.4 కోట్ల విలువైన నాలుగు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు బ్యాంకాక్‌లో కొనుగోలు చేసి సింగపూర్ మీదుగా వైజాగ్ తరలించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన డీఆర్ఐ అధికారులు.. ఎయిర్ పోర్టులోకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్టులో ఇంత విలువైన గంజాయి లభించడం ఇదే మొదటిసారి.
Also Read : వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మురళీ కార్తీక్ ఫైర్
Follow Us On: Youtube

