కలం, వెబ్ డెస్క్: క్రిటిక్స్‌కు పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ (Usman Tariq) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తన బౌలింగ్ యాక్షన్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో డెజర్ట్ వైపర్స్ తరఫున ఆడుతున్న పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తన బౌలింగ్ యాక్షన్‌పై ఆగాటు ఆరోపణలు వస్తున్నాయి. సరైన అవగాహన లేకుండా విమర్శలు చేయొద్దని స్పష్టంగా సూచించాడు. ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తారిక్ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. టామ్ బాంటన్ వికెట్ తర్వాత అతని యాక్షన్‌పై మరోసారి చర్చ మొదలైంది.
దీనిపై స్పందించిన తారిక్ (Usman Tariq) తాను పాకిస్థాన్‌లో రెండు సార్లు అధికారిక బౌలింగ్ యాక్షన్ పరీక్షలు పూర్తి చేసి క్లియర్ అయ్యానని వెల్లడించాడు. తన యాక్షన్ కొంచెం భిన్నంగా కనిపించినా అది పూర్తిగా చట్టబద్ధమైనదేనని స్పష్టం చేశాడు. తాను బంతిని విసరడం లేదన్న నమ్మకం తనకు పూర్తిగా ఉందని అన్నాడు. క్రికెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా అభిప్రాయాలు పంచుకోవడం హానికరమని తారిక్ వ్యాఖ్యానించాడు. ముందు ఆటపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని విమర్శకులకు హితవు పలికాడు.
Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్ యువ భారత్‌దే
Follow Us On : WhatsApp


