కలం వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్పోర్ట్(Bhogapuram Airport) విషయంలో వైసీపీ(YCP) చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు(Ganta Srinivasa Rao) ఆరోపించారు. చంద్రబాబు ఎయిర్ పోర్ట్కు భూసేకరణ చేసినప్పుడు జగన్(Jagan) దాన్ని వ్యతిరేకించారని, 2019లో అధికారంలోకి వచ్చాక భూములు తిరిగి ఇస్తామని చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తయ్యాక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంపై మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపెట్టారు. తరతరాల నుంచి తమదిగా భావించే భూపట్టాదారు పాస్ పుస్తకాల మీద వైయస్ జగన్ తన ఫోటో వేయించుకున్నాడని విమర్శించారు. జగన్కు పబ్లిసిటీ పిచ్చి ఉందని, సర్వే రాళ్ల మీద కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన బొమ్మ వేయించుకున్నాడని ఆరోపించారు. ప్రజలు అందుకే ఎన్నికల్లోనే జగన్కు తీర్పునిచ్చారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసిందని పేర్కొన్నారు. స్థానికంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, ప్రస్తుతం ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి భోగాపురం వరకు అభివృద్ధి పనులు జరుగనున్నట్లు వెల్లడించారు. త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.


