కలం, స్పోర్ట్స్: ప్రస్తుత క్రికెట్లో బౌలర్ల పాత్ర రోజురోజుకు తగ్గిపోతోంది. బౌలర్లు కేవలం ఒక నామమాత్రపు ప్లేయర్లుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో బౌలర్లపై భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బౌలర్లంటే బాధితులు కాదని, మ్యాచ్ శాసించగల సత్తా ఉన్న ఆటగాళ్లని అన్నారు. కొంతకాలంగా టీ20 క్రికెట్లో బ్యాటర్ల దూకుడు పెరిగింది. తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. భారీ స్కోర్లు సాధారణమైపోతున్నాయి. అయినా బౌలర్లను బాధితులుగా చూడకూడదని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అంటున్నాడు. సరైన ప్రణాళికతో బౌలర్లు కూడా ఆటను తమ నియంత్రణలోకి తెచ్చుకోగలరని అభిప్రాయపడ్డాడు.
బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో భువీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన బ్యాటర్ల ఆలోచనా విధానాన్ని మార్చిందని తెలిపాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని వివరించాడు. అయితే బ్యాటర్లు ఎక్కడ బంతిని కొట్టాలనే దానిపై బౌలర్లు ప్రభావం చూపగలరని పేర్కొన్నాడు. దీనికి బౌలర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించాడు. గత నాలుగేళ్లలో టీ20 క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కూడా చాలా మారిందని భువీ తెలిపాడు. 200 పరుగులు కూడా సాధారణ స్కోరుగా మారుతున్నాయని చెప్పాడు.
ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో బౌలర్లకు పరిస్థితులు సవాలుగా ఉంటాయని వివరించాడు. బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్న వైట్‌బాల్ క్రికెట్లో బౌలర్లు పరిస్థితులను అంచనా వేసి, తమ ప్రణాళికలను అమలు చేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో రాణించాలంటే బౌలర్లకు ఎంతో పరిణతి అవసరమని భువీ పేర్కొన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలాంటి ప్రణాళికతో బౌలింగ్ చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపాడు.
ఇదిలా ఉంటే, నాలుగేళ్ల విరామం తర్వాత భువనేశ్వర్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20కి అర్ష్‌దీప్ సింగ్ గాయంతో దూరం కావడంతో అతడికి అవకాశం దక్కింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భువీ(Bhuvneshwar Kumar)కి బౌలింగ్ చేసే అవకాశం లభించింది.
Also Read : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు సింధూ..!
Follow Us On : WhatsApp

