జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలి : భవేశ్ మిశ్రా

కలం, కడెం: వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులు పొందాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. కడెం మండలం కొండుకూరు గ్రామంలోని ఎస్‌కే ఫంక్షన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన జోన్‌ -1 స్థాయి విబిజి రామ్ జీ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎల్‌ నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున, జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకం కింద చేపట్టే పనులకు కూలీ డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గ్రామాల్లో నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి వంటి పనులను చేపట్టడం ద్వారా ఉపాధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్​ (Bhavesh Mishra) పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజల వద్దకే వెళ్లి ఉపాధి పనులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు సందీప్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>