కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కవిత చేస్తున్న ఆరోపణలకు హరీశ్ రావు సిగ్గుతో తల దించుకోవాలని, కేసీఆర్‌ను మోసం చేసి మొత్తం దోచుకున్నాడు కవిత చేస్తున్న ఆరోపణలకు హరీశ్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
కవిత ఆరోపణలపై నిగ్గు తేల్చకుండా హరీశ్ (Harish Rao) ప్రెజెంటేషన్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను ఇరికించిందే హరీశ్ అని కోమటిరెడ్డి ఆరోపించారు. అందుకే రెండోసారి ఆయనకు మంత్రి పదవి లేట్‌గా ఇచ్చారని, హరీష్ రావు మంచోడే అని కేటీఆర్, కేసీఆర్ ఒక్క మాటైనా చెప్పట్లేదు ఎందుకు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.


