కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభంమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ, పీజీ యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించాలని వాయిదా తీర్మానం చేసింది. ఇటీవల సమావేశంలోనూ బీజేపీ (BJP) నిజాంసాగర్ ప్రాజెక్టు, కాల్వల పునరుద్ధరణపై వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కీలక గెజిట్ నోటిఫికేషన్లను ప్రవేశపెట్టనుంది. అలాగే పలు ముఖ్యమైన రంగాలపై చర్చలు జరగునున్నాయి.


