కలం వెబ్ డెస్క్ : బెంగళూరు(Bengaluru)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ థియేటర్ లేడీస్ టాయిలెట్లో సీక్రెట్ కెమెరాలు(secret cameras) ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని మదివాల(Madivala)లో ఉన్న సంధ్య థియేటర్(Sandhya Theatre) ఆదివారం ప్రేక్షకులతో హౌస్ ఫుల్ అయ్యింది. ఇంటర్వెల్ టైంలో పలువురు మహిళలు టాయిలెట్లో సీక్రెట్ కెమెరాలు ఉండటాన్ని గమనించారు. థియేటర్లో పని చేసే ఓ మైనర్ బాలుడు లేడీస్ టాయిలెట్లో సీక్రెట్ కెమెరాలు(secret cameras) అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మహిళలు ఆగ్రహంతో బాలుడిని పట్టుకొని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న మదివాల పోలీసులు థియేటర్‌కు చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఈ బాలుడు చేసిన పనేనా? ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


