epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ బాంబు పేలుడు వెనక ఘోస్ట్​ సిమ్​లు.. ఎన్​క్రిప్టెడ్​ యాప్​లు

కలం, వెబ్​డెస్క్​: నిరుడు నవంబర్​లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 15 మందిని బలిగొన్న బాంబు పేలుడు (Delhi bomb blast) వెనక కీలక అంశాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA investigation) – ఎన్​ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ) అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితులైన డాక్టర్లు.. పాకిస్థాన్​లోని టెర్రరిస్ట్​ గ్రూప్​ సభ్యులతో టచ్​లో ఉండడానికి ఘోస్ట్​ సిమ్​లు, ఎన్​క్రిప్టెడ్​ మెసేజ్​ యాప్​లు వాడినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్​ బాంబర్​ ఉమర్​ నబీతోపాటు మరో ఇద్దరు నిందితులు రెండు, మూడు ఫోన్​లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇందులో వాళ్ల పేరుతో తీసుకున్న సిమ్​లతోపాటు, నకిలీ ఆధార్​ కార్డులతో తీసుకున్న సిమ్​లు కూడా వాడినట్లు చెప్పారు.

అలాగే ఫోన్​లో సిమ్​ లేకపోయినా మెసేజ్​లు పంపడానికి ఎన్​క్రిప్టెడ్​ యాప్​లు వాడారని వెల్లడించారు. ఘోస్ట్​ సిమ్​లు అంటే.. అక్రమ లావాదేవీలు, తప్పుడు పనులు చేయడానికి వీలుగా ఇతరుల పేరు, అడ్రస్​తో తీసుకునేవే ఘోస్ట్​ సిమ్​లు. వీటిని ఎక్కువగా సైబర్​ నేరగాళ్లు, ఉగ్రవాదులు ఉపయోగిస్తుంటారు. ఈ ఘోస్ట్​ సిమ్​లు, ఎన్​క్రిప్టెడ్​ యాప్​లు ఉపయోగించిన నిందితులు పాకిస్థాన్​ నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పాటించి ఢిల్లీ బాంబు పేలుడు (Delhi bomb blast) కు కావాల్సిన ఐఈడీ బాంబులు ఇక్కడే తయారుచేసినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు.

Read Also:  పెండ్లి వేడుకల్లో విషాదం.. సర్పంచ్​ను కాల్చి చంపిన దుండగులు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>