కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) స్పందించారు. కేరళలోని వయనాడ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ వైఫల్యాల భారాన్ని క్రీడలపై మోపకూడదని, ఆటలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని శశి థరూర్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌తో భారత్ అనేక రకాలుగా దౌత్యపరమైన సంబంధాలను కొనసాగిస్తోందని ఆయన గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తాను ఇప్పటికే ఖండించానని థరూర్ తెలిపారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం ఇప్పటికే బంగ్లాదేశ్‌ను కోరుతోందని చెప్పారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ముస్తాఫిజుర్‌ను పంపించేయాలని నిర్ణయించడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆగ్రహావేశాలను బట్టి ప్రభుత్వ విధానాలు మారడం ఆందోళన కలిగించే విషయమని థరూర్ (Shashi Tharoor) విమర్శించారు. కొన్ని నిర్ణయాలు ఇలాంటి ప్రభావాలకు అతీతంగా ఉండాలని ఆయన సూచించారు.
Read Also: ఢిల్లీ బాంబు పేలుడు వెనక ఘోస్ట్ సిమ్‌లు.. ఎన్క్రిప్టెడ్ యాప్‌లు
Follow Us On: Youtube


