కలం, వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్.. బ్లాక్ బస్టర్ సాధించాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు కానీ.. అది రావడం లేదు. తొలి సక్సెస్ కోసం.. నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో చేస్తున్న మూవీ లెనిన్ (Lenin Movie). ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. అయితే.. ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీని దింపుతున్నారని తెలిసింది. ఇంతకీ.. ఆ బ్యూటీ ఎవరు? లెనిన్ లో ఆమె పాత్ర ఏంటి?
లెనిన్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న మూవీ ఇది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అఖిల్ యాస నేర్చుకున్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అఖిల్ (Akhil Akkineni) రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 5న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో కథనాయికగా ముందుగా కిసిక్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. ఆతర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆతర్వాత భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు. శ్రీలీలతో తీసిన సీన్స్ ను భాగ్యశ్రీ బోర్సే తో రీషూట్ చేశారు.
అయితే.. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ను ఎవరితో చేస్తారు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ.. కొంత మంది హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) పేరు వినిపిస్తుంది. అనన్య లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అయితే.. ఈ బాలీవుడ్ బ్యూటీతో లెనిన్ లో స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆమెను కాంటాక్ట్ చేయడం.. నిజమే అని తెలిసింది. అయితే.. దీనికి ఇంకా అనన్య నుంచి ఎలాంటి కన్ ఫర్మేషన్ రాలేదట. మరి.. ఈ బాలీవుడ్ బ్యూటీ లెనిన్ లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఎస్ చెబుతుందో.. నో చెబుతుందో చూడాలి.
Read Also: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన రాశీ..?
Follow Us On: X(Twitter)


