కలం, వెబ్ డెస్క్ : మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు లులు మాల్ లో జరిగిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూశాం. ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) అతని భార్య స్నేహారెడ్డికి కూడా ఇంచుమించు ఇలాంటి ఘటనే ఎదురైంది. వీకెండ్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్ కు వెళ్లాడు. బన్నీని చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా తన భార్యను తీసుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ బాడీగార్డులు లేకుండా రావడంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమైంది.
కేఫ్ సిబ్బంది, పర్సనల్ సిబ్బంది అతికష్టం మీద అల్లు అర్జున్, స్నేహారెడ్డిని కారెక్కించారు. కారు వద్దకు వెళ్లే క్రమంలోనూ బన్నీ చాలా ఇబ్బంది పడ్డాడు. కారు ఎక్కే క్రమంలో ఫ్యాన్స్ కు అభివాదం చేసి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. అంత జనాలు ఉండే చోటుకు వెళ్లడం బన్నీ ఎందుకు అని కొందరు అంటున్నారు. హీరోలను చూడగానే ఎందుకు అలా ఎగబడటం.. వాళ్లు కూడా మనలాంటి మనుషులే కదా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.


