కలం వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురోను (Nicolas Maduro) అరెస్ట్ చేసిన సందర్భంగా జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ “డిక్టేటర్లను ఇలా ఎదుర్కోవచ్చు అంటే అమెరికా పుతిన్‌ను కూడా అదే విధంగా చూడాలి” అని అన్నారు. 2019 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో జెలెన్ స్కీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు రష్యా ప్రభుత్వం మదురోను విడుదల చేయాలని, స్వతంత్ర దేశ అధ్యక్షుడిని కాపాడాలని అమెరికాకు సూచించింది. మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం న్యూయార్క్‌కు తరలించింది. వీరిపై ఫెడరల్ నార్కో టెర్రరిజం కేసులకు సంబంధించి విచారణ చేపట్టనున్నారు.

Read Also: వెనెజువెలాకు ఫ్రీ ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
Follow Us On: Pinterest


