కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU Results) పరిధిలో నిర్వహించిన పీజీ, ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 962 మంది విద్యార్థులు హాజరుకాగా.. 66.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు 243 మంది విద్యార్థులు హాజరుకాగా.. 66.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ (http://www.mguniversity.ac.in)లో పరిశీలించుకోవచ్చని డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

