డీఎస్సీ-2008 కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

కలం, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ-2008 నియామకాలపై (DSC 2008 Recruitment) తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవో నంబర్‌ 28లో చేసిన సవరణను సవాల్‌ చేస్తూ బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన మూడు రిట్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డీఎస్సీ-2008 నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత రూల్‌ 7కు ప్రొవిజన్‌ జోడించడాన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం నిబంధనల్లో చేసిన మార్పును ప్రశ్నిస్తూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. పిటిషన్లలో బలం లేకపోవడంతో వాటిని డిస్మిస్‌ చేస్తూ తీర్పు ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>