యాదగిరిగుట్ట మండల వనరుల కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) మండల వనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అపార్, ఆధార్‌కు సంబంధించిన పెండింగ్ పనులతోపాటు డ్రాప్ బాక్స్‌లోని అంశాలను వెంటనే క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పీఎంశ్రీ నిధులకు సంబంధించిన బిల్లులను బిల్లువారీగా సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

పాఠశాలల పాఠ్యపుస్తకాల పార్ట్‌-2 పుస్తకాలను వెంటనే వేరు చేసి, రెండు రోజుల్లోగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని స్పష్టం చేశారు. పెండింగ్ పనుల్లో జాప్యం చేయకుండా నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంట ఎం.ఎస్. రమాదేవి, సీఆర్పిలు భిక్షపతి, శివకుమార్, రమేశ్, సంగీత, సంజీవ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>