నేడు ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న ఆయన, ముందుగా ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమై నదుల అనుసంధానం, తాగునీటి సరఫరా వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సరస్ మేళాను, అలాగే ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ వేడుకలను తమిళనాడు సీఎం విజయ్ సందర్శిస్తారు. అన్ని రాష్ట్రాల హస్తకళల ఉత్పత్తులతో కొలువుదీరిన సరస్ మేళాను ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించి తిలకించనున్నారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఏపీకి వస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>