హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ హుటాహుటిన ఢిల్లీకి వెళ్తున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే ఇద్దరు హస్తినకు బయల్దేరనున్నారు. చంద్రబాబు సహా ఇతర ఎన్డీయే నేతలను వెంటనే రావాలని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు బిల్లులను ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో ఢిల్లీలో సాయంత్రం ఎన్డీయే పార్టీల నేతల కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు బిల్లులు ప్రవేశ పెట్టి, ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయే పార్టీల సమావేశం నిర్వహించనుంది.

2011 జనాభా లెక్కల అంశం తొలగింపు..?

డీ లిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటివరకు చెబుతూ వస్తున్న 2011 జనాభా లెక్కలను తొలగించి.. పాత పద్ధతిలోనే అంటే 1971 జనాభా లెక్కల ఆధారంగానే ప్రస్తుత లోక్‌సభ సీట్లు తగ్గకుండానే.. అదనంగా 50 శాతం పెంచాలని భావిస్తోంది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల పెంపు ముప్పు తొలగిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిలో 50 శాతం సీట్లు పెరిగితే.. ఇప్పుడున్న స్థానాలు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లుతో డీ లిమిటేషన్ బిల్లు ముడిపడి ఉన్న తరుణంలో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>