చంద్రఘంటా అవతారంలో బాసర సరస్వతి అమ్మవారు దర్శనం..!

కలం, బాసర: నిర్మల్ జిల్లా బాసర (Basara Navaratri) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు చంద్రఘంటా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బాలాలయంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రఘంటా అవతారంలో అమ్మవారి శిరస్సుపై అర్ధచంద్రాకారంలో గంటను పోలిన చంద్రుడు ఉండటంతో ఆమెకు ఆ పేరు వచ్చిందని పండితులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>