ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ నిఘా..నిషేధిత వస్తువు గుర్తింపు..

కలం, నేషనల్‌ డెస్క్ : ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) భద్రతా తనిఖీల సందర్భంగా ప్రయాణికుడి బెల్ట్‌లో దాచిన కత్తిని (Knife ) సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ ప్రయాణికుడు అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో విమానాశ్రయంలో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో అతడి వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఎక్స్-బిస్ స్కానింగ్ సమయంలో బెల్ట్ బకిల్‌లో లోహపు వస్తువు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికుడిని పక్కకు తీసుకొని భౌతిక తనిఖీలు నిర్వహించగా, బెల్ట్ బకిల్‌లో దాచిన కత్తి బయటపడింది. దీంతో అధికారులు ఆ కత్తిని స్వాధీనం చేసుకొని నిబంధనల ప్రకారం నిషేధిత వస్తువుగా గుర్తించి తొలగించారు. ఈ ఘటన విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>