తిమ్మాపూర్‌ సీఐగా అనిల్‌, కోరుట్ల సీఐగా తిరుపతి నియామకం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌ పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) పరిధిలోని కీలక సర్కిల్స్‌కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను కేటాయిస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-1 పరిధిలో ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రామగుండం సీసీఆర్‌బీలో పనిచేస్తున్న బి. అనిల్‌ను కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్‌కు కేటాయించారు. అలాగే, కరీంనగర్ సీపీసీలో సేవలందిస్తున్న కొమ్ము తిరుపతిని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

​కొద్ది రోజుల క్రితం తిమ్మాపూర్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన బొల్లం రమేష్ సస్పెండ్ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరోవైపు, కోరుట్లలో పనిచేసిన లక్ష్మీనారాయణను గత వారం మల్టీ జోన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఇద్దరు అధికారులకు స్థానచలనం కల్పిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>