ఒక్క వాట్సాప్​ మెసేజ్​తో మీ ఖాతా ఖాళీ.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

కలం, వెబ్​ డెస్క్​ : వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ సూచించారు. డబ్బులు కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగం  (Cyber Fraud) పన్నారు. మీ బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు కట్​ అయ్యాయంటూ నకిలీ సందేశాలు పంపి, లావాదేవీలు తాము చేయలేమని నిర్దారించేందుకు ‘NO’ అని రిప్లై ఇవ్వాలని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం (Cyber Fraud) తన దృష్టికి వచ్చినట్లు సీపీ సజ్జనార్​ వెల్లడించారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ అని చెప్పారు. మొదట గుర్తు తెలియని నంబర్​ నుంచి వాట్సాప్​ కు డబ్బులు కట్​ అయినట్లు మెసేజ్​ రావడంతో భయాందోళనకు గురయ్యేలా చేస్తారు. తరువాత ఈ లావాదేవీలు మీరు చేయకపోతే వెంటనే No అని రిప్లై ఇవ్వాలని రెండో మెసేజ్​ వస్తుంది. కంగారులో ‘NO’ అని రిప్లై ఇవ్వడంతో వల్లే ఫోన్‌పై హ్యాకర్లకు నియంత్రణ లభించి, బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్​ హెచ్చరించారు. ఇలా చేస్తే మీ ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేసే అవకాశముందన్నారు.

ఇలాంటి మెసేజ్​ లు వచ్చినప్పుడు కంగారుపడి ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఆ నంబర్​ ను బ్లాక్​ చేసి చాట్​ డిలీట్ చేయాలని సీపీ సూచించారు. ఖాతాలో డబ్బులు కట్​ అయితే అధికారిక యాప్​ లను వినియోగించి వివరాలు తెలుసుకోవాలన్నారు. సైబర్​ మోసానికి గురైతే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్​ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>