గద్వాలలో హీరోయిన్ రితికా నాయక్ సందడి

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో ‘మిరాయి’ ఫేం హీరోయిన్‌ రితికా‌ నాయక్ (Ritika Nayak)  సందడి చేశారు. ఆమె విశిష్ట అతిథిగా విచ్చేసి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు, వైస్ ఛైర్మన్ శంకర్ , వార్డు కౌన్సిలర్లు,‌ నాయకులు పాల్గొని పలు విభాగాలను ప్రారంభించారు.

హీరోయిన్‌ రితికా నాయక్ మాట్లాడుతూ.. తక్కువ ధరలకే చీరెలు, కిడ్స్‌వేర్‌, చుడీదార్‌, లెగ్గిన్స్‌, ఫ్యాన్సి డ్రెస్సెస్‌, పట్టు చీరలు, మెన్స్‌ రెడీమేడ్‌ దుస్తులు, నైటీలు చందన మాల్‌లో లభ్యమవుతాయన్నారు. గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెట్రో సిటీలో ఉండే షాపింగ్‌ మాల్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యజమానులకు అభినందనలు తెలియచేశారు. గద్వాల బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి బాసు హన్మంతునాయుడు, మాజీ జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>