సింగరేణిపై బీఆర్ఎస్ గురి.. భారీ బహిరంగ సభకు ప్లాన్

కలం, వెబ్ డెస్క్: సింగరేణి బొగ్గు గనులపై మరోసారి పట్టు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 14న జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉంది.

మరోవైపు, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో రాజకీయంగా పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే సింగరేణి కార్మిక సంఘాలపై టీఆర్ఎస్ చీఫ్ కవితకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సింగరేణి కార్మికుల మద్దతును తిరిగి కూడగట్టుకోవడంతో పాటు, కోల్‌బెల్ట్‌లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవడమే ఈ సభ వెనుక ప్రధాన లక్ష్యమా? అన్న చర్చ సాగుతోంది. అయితే, ఈ సభ ద్వారా బీఆర్ఎస్ ఎలాంటి రాజకీయ సంకేతాలు ఇస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>