ఓట్ చోరీ.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

కలం, వెబ్ డెస్క్: ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆయన తరఫున లీగల్ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరు కావాలని భావించినప్పటికీ, ఆయన తరఫున న్యాయ బృందం పిటిషన్ దాఖలు చేసింది.

అంతకుముందు మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వానికి చెందిన 200 మంది అధికారులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విదేశాంగ శాఖకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందిస్తున్నారన్నారు. మీరేం చేయాలనుకుంటే అది చేయండంటూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>