కలం, వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ కు సర్వం సిద్ధమైంది. ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) కీలకంగా మారబోతుందని కూటమి నేతలు చెబుతున్నారు. రేపు కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్ పోర్టుకు రాబోతోంది. ఇదే చివరి ట్రయల్ రన్ అని అధికారులు చెబుతున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ తర్వాత వచ్చే మే నెల నుంచే ఇక్కడ విమానాల రాకపోకలు ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విమాన సంస్థలతో కేంద్ర మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఇది ప్రారంభం అయితే ఉత్తరాంధ్ర వాసులకు ఎయిర్ పోర్టు కష్టాలు తీరినట్టే అంటున్నారు కూటమి నేతలు.

Read Also: ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
Follow Us On: Sharechat


