కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులతో పాటు కొన్ని తీర్మానాలకూ ఏకగ్రీవ ఆమోదం లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను ఇవ్వాలని, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలకు శాసనసభ ఆమోదం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యయపరిమితి పెరిగిపోయిందని, ఇప్పుడు 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ లేదా మరే ఏ ఇతర రూపంలో నైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ (Telangana Assembly) ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
Read Also: వాళ్లను ఉరితీసినా తప్పులేదు.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్
Follow Us On: Pinterest


