కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టిన మాజీ ఇరిగేషన్ మంత్రిని ఉరి తీసినా తప్పులేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (Rakesh Reddy). శనివారం రాత్రి అసెంబ్లీలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ‘నీటి పారుదల శాఖలో దోపిడీ చేసిన వారికి కూడా తాలిబన్ చట్టాలనే అమలు చేయాలి. అంచనాలు పెంచడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారు. కేవలం బడ్జెట్ పెంచుకోవడం కోసం ఇలా చేశారు. ఇలా అంచనాలను పెంచే సలహా ఇచ్చిన ఆఫీసర్లను కూడా ఉరి తీయాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.
నిధులు, పదవుల విషయంలో ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు రాకేష్ రెడ్డి (Rakesh Reddy). నిధులు, పదవులు మొత్తం దక్షిణ తెలంగాణ వాళ్లే దోచుకుంటున్నారని.. ఈ రాజకీయాలు తనకు అస్సలు నచ్చట్లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని రాకేష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
Read Also: దేవుడి మీద ఆన.. బతికున్నంతకాలం భంగం రానివ్వ : సీఎం
Follow Us On: Instagram


