కలం, వెబ్ డెస్క్ : ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. చూస్తుండగానే ఓ సైనికుడు పట్టాలపై ప్రాణాలు వదిలాడు (Suicide). విశాఖపట్నంలోని (Visakhapatnam) దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిందీ దారుణం. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి అనే సైనికుడు దువ్వాడ రైల్వేస్టేషన్ కు వచ్చాడు. ఫ్లాట్ ఫామ్-1 దగ్గరకు ట్రైన్ వస్తుండగా వెంటనే పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. ట్రైన్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేసేలోపే దారుణం జరిగిపోయింది. రైలు చక్రాలు తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ కు రెడీ..
Follow Us On: Youtube


