epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇల్లు చక్కబెట్టలేనోడు వాటి గురించి మాట్లాడడం విడ్డూరం.. కేసీఆర్​ పై పొంగులేటి ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : ఇల్లు చక్కపెట్టలేనోడు.. ఇప్పుడు రాష్ట్ర నీటివాటాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. దేశంలో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోకుండా ఒడిసిపడితే దేశానికి మంచి జరుగుతుందనని కేసీఆర్​ (KCR) గొప్పగొప్ప మాటలు చెప్పారన్నారు. కానీ, కృష్ణానది బేసిన్​ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన జీవోలు సద్వినియోగం చేసుకొలేదని మండిపడ్డారు. మూడో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పొంగులేటి మాట్లాడారు. పోతిరెడ్డిపాడులో 11 వేల క్యూసెక్కులను 42 వేల క్యూసెక్కులకు, మళ్లీ వీటిని 92 వేల క్యూసెక్కులాగా పెంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పక్క రాష్ట్రం నీళ్లను దోచుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడే పర్మిషన్​ లేకుండా మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం జరిగిందన్నారు. విభజన నాటికి తెలంగాణలో సుమారు 30 ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీవోలు ఇచ్చారని, వాటి నిర్మాణాలు ఇంకా జరుగుతున్నాయన్నారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టుకు 70 టీఎంసీలకు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సుమారు పది టీఎంసీల కు, ఎస్ఎల్ బిసి టన్నెల్ కు 30 టీఎంసీలకు బీఆర్​ఎస్​ (BRS) ప్రభుత్వం జీవో ఇచ్చిందని పొంగులేటి గుర్తు చేశారు. అలాగే, జూరాల కంటే శ్రీశైలం సుమారు 100 మీటర్ల దిగున ఉన్నప్పటికీ దాని తేడా గమనించకుండా దిగు ప్రాంతంలో ప్రాజెక్టు కట్టారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల కింద ఇచ్చిన 70 టీఎంసీలకి క్లియర్ ఎల్లోకేషన్ ఉందన్నారు. 70 టీఎంసీల నీళ్లను సజావుగా వినియోగించుకొని ఉంటే హైట్ వేరియేషన్ కలిసి వచ్చేదని చెప్పారు. 37 లిఫ్టుల ఖర్చుతో పాటు ప్రతి సంవత్సరం కరెంటుకి ఆదా అయ్యేదని ఆయకట్టు కూడా కలిసి వచ్చేదని తెలిపారు. స్వార్థం, స్వలాభం, సొంత ఆస్తులను పెంచుకోవడానికి జూరాల (Jurala) నుంచి కాకుండా, శ్రీశైలం నుచి తీసుకున్నారని పొంగులేటి ఆరోపించారు. దీని ఫలితంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేశారని, వారు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నామని బీఆర్​ఎస్​ పార్టీ నాయకులకు బాధ, దురద ఎక్కువైందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy)  విమర్శించారు.

Read Also: హరీశ్‌రావు గొంతు నొక్కిన కేసీఆర్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>