కలం, నిజామాబాద్ బ్యూరో: సాగునీటి అవసరాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) నుంచి దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ల ఆదేశాల మేరకు కాకతీయ ప్రధాన కాలువ నుంచి ఎల్ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టు కోసం 2000 క్యూసెక్కులతో సాగు నీటిని విడుదల ప్రారంభించామని ప్రాజెక్టు ఈఈ లాల్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత నీటి విడుదల క్రమంగా నాలుగు వేల క్యూసెక్కులు అయ్యింది.
తర్వాత క్రమంగా పెంచి విడుదల చేయనున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో తగినంత నీటి నిలువ లేనందువల్ల విడుదల చేసిన నీటిని రైతులు సక్రమంగా, పొదుపుగా వాడుకోవాలని పోచంపాడు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదీష్ కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 80 tmc లకు గానూ 45 tmc ల నీటి నిల్వ మాత్రమే ఉందన్నారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలతో జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది.
Also Read : సీఎం రేవంత్ పై ఆరోపణలు.. మెడికవర్ హాస్పిటల్ సంచలన ప్రకటన!
Follow Us On: Youtube

