H-1B వీసాలు రాకపోతే భారత్‌కే లాభం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా హెచ్ 1- బీ (H1B Visa) వీసాలు మంజూరుపై కఠిన ఆంక్షలు విధించడం భారత్‌కే గొప్ప వరమని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికా వీసా విధానాలు, భారతీయ స్టార్టప్ వ్యవస్థపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా గడిచిన 30 ఏళ్లలో మన దేశానికి చెందిన అత్యంత ప్రతిభావంతులైన యువత తరలివెళ్లి, అక్కడ పెద్ద ఎత్తున బిలియనీర్లుగా స్థిరపడ్డారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అదే మేధోసంపత్తి, సాంకేతిక నైపుణ్యం భారతదేశంలోనే ఉండి ఉంటే.. ఇక్కడే ఎన్నో అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలు, నూతన ఆవిష్కరణలు మరియు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటై ఉండేవి అని అభిప్రాయపడ్డారు.

అయితే అమెరికా విధిస్తన్న వీసా నియంత్రణ వల్ల ప్రతిభావంతులైన మేధావులు మన దేశంలోనే ఉంటారని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, స్థానిక పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. మారుతున్న టెక్నాలజీ యుగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫ్‌షోర్ విధానాలు బాగా పెరిగాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇందులో భాగంగానే గ్లోబల్ కంపెనీలు తమ ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల’ ను బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై వంటి నగరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. H1B Visa లపై ఆంక్షల వల్ల అమెరికా వెళ్లలేని ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ సెంటర్లలో పనిచేయడమే కాకుండా, దేశీయ స్టార్టప్‌లు, డిప్‌టెక్ రంగాల పురోగతికి ఊతాన్నిస్తారని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read : నిరసన ఆగదు: తుషార్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>