కలం, వెబ్ డెస్క్ : తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే (TVK) పొత్తుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే టీవీకే అధికారి ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజ భాగస్వాములు అని.. విజయ్ (Vijay Thalapathy), రాహుల్ (Rahul Gandhi) కూడా మంచి మిత్రులు అంటూ ఆయన హింట్ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు.
కాకపోతే రెండు పార్టీల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలున్నాయని.. వాటిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఫెలిక్స్. తమిళనాడుకు చెందని కాంగ్రెస్ నేతలు పొత్తుకు అడ్డంకింగా మారుతున్నారని.. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం అలా చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. చూస్తుంటే టీవీకే (TVK) పార్టీ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు మత రాజకీయాలకు వ్యతిరేకమే అని.. లౌకిక వాదంతో ముందుకు వెళ్లే పార్టీలు కాబట్టే పొత్తుకు అనుకూలం అని టీవీకే నేతలు చెబుతున్నారు.
Read Also: సేవలన్నీ ఒకే మొబైల్ యాప్‌లో ఫీడ్‌బ్యాక్ కోరిన ఈసీ
Follow Us On: Pinterest


