కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి . సీజేపీ పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వ్యాప్తంగా హైఅలర్ట్ (Delhi High Alert) ప్రకటించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి అత్యంత ఆధునిక ఆయుధాలు, దంగ నిరోధక సామగ్రితో సజ్జమైన దాదాపు 7వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని అత్యవసరంగా రంగంలోకి దించారు. ఈ మొత్తం భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా నిరంతరం సమీక్షిస్తున్నారు.
నగర సరిహద్దుల గుండా ప్రవేశించే ప్రతీ వాహనాన్ని ఢిల్లీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్న పలువురు నిరసనకారులను ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పాటు రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో పోలీసులు ముమ్మర చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు మరియు శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుజాగ్రత్తగా ఇవాళ, రేపు నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలను బంద్ చేయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ వేవ్.. బెంగాల్‌లో బీజేపీ జోరు!
Follow Us On: X(Twitter)

