సంబరాలు ఇళ్లలోనే జరుపుకోండి: సీపీ సజ్జనార్ భావోద్వేగ విజ్ఞప్తి!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై అర్థరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని, బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్స్ వంటివి తక్షణమే నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ (Sajjanar)  నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ట్యాంక్ బండ్ వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్వాల్‌కు చెందిన సరాక్షి (6) చిన్నారి పుట్టిన రోజును ట్యాంక్ బండ్ పై కుటుంబ సభ్యులు జరుపుతుండగా… వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో చిన్నారితో పాటు ఓ బంధువు అక్కడే మరణించినట్లు సజ్జనార్ తెలిపారు.

ఈ క్రమంలోనే సంతోషంగా సాగాల్సిన పుట్టినరోజు వేడుకలు కొందరి నిర్లక్ష్యం, రోడ్లపై చేసే ప్రదర్శనల వల్ల తీవ్రమైన విషాదంలో ముగుస్తున్నాయని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్యాంక్ బండ్ మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, చెరువుల గట్లు, పార్కులు, ఫ్లైఓవర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేడుకలపై కఠిన నిబంధనలు ఉన్నాయని, అర్థరాత్రి అతివేగంగా వచ్చే వాహనాల వల్ల తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. యువతో పాటు తల్లిదండ్రులు సంబరాలేవైనా భద్రంగా ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>