కలం, వెబ్ డెస్క్ : పంటలు ఎండిపోతుంటే సాగునీరు ఇవ్వాలని నిలదీసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తారా అని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలోని జూరాలా ప్రాజెక్టు (Jurala Project) ఎడమ కాలువ పరిధిలోని పంటలకు నీళ్లు ఇవ్వాలని సెప్టెంబర్ 19న రైతులు నిరసన తెలిపారు. నీళ్లివ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన స్పందించలేదు. దీంతో రైతులు ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్లు ఎత్తి స్వయంగా నీళ్లు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారంటూ హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
కళ్ల ముందే పంటలు ఎండుతుంటే నీళ్లు ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు, కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అయ్యారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే పంటలు ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని హరీశ్ రావు ఆరోపించారు.
నీళ్ల కోసం రోడ్డొక్కి నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే.. పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు.
Also Read : ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ
Follow Us On: Youtube

