ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి

కలం, ములుగు :  ములుగు (Mulugu) జిల్లాలో ఇసుక లారీ అదుపుతప్పి వరుసగా రెండు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు (CRPF Jawans) మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇసుక లారీ తొలుత సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది (CRPF Jawans) ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న అనంతరం కూడా లారీ ఆగకుండా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మరోవైపు లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో చిక్కుకున్న రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఓవర్‌స్పీడ్‌, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Also Read : ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>