బెంగళూరులో ‘ఎస్‌ఐఆర్’ కాక: ఒకే వేదికపై ధ్రువ్ రాఠీ, ప్రకాష్ రాజ్

కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు (Bengaluru)లోని ఫ్రీడమ్ పార్క్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (SIR) విధానానికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సీజేపీ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నటుడు ప్రకాష్ రాజ్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేలతో పాటు పలువురు ప్రముఖులు ఒకే వేదికను పంచుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పీపుల్స్ ట్రిబ్యునల్‌లో పాల్గొన్న ప్రసంగీకులు ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, వేదిక ముందున్న నిరసనకారులతో ‘నరేంద్ర మోదీ వోట్ చోర్’ అంటూ నినాదాలు చేయించారు. దేశంలో ఓటర్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ నిరసన వేదికపై ధ్రువ్ రాఠీ, విలేకరి జుబేర్, అభిజీత్ దిప్కేలు కలిసి కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు, వామపక్ష యువజన విభాగాలు పాల్గొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>