ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ

కలం, వెబ్​ డెస్క్ : దశాబ్ధ కాలంలో మొబైల్​ ఫోన్లు సాధారణ కమ్యూనికేషన్ పరికరాల స్థాయి నుంచి సుపరిపాలనను ప్రజల వద్దకు చేర్చే విధంగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్​ కాంగ్రెస్​ –2026 (India Mobile Congress) సదస్సును ప్రారంభించిన ఆయన ప్రసంగించారు. భారత టెలికాం రంగం కేవలం నెట్​ వర్క్ లు, స్పెక్ట్రమ్​, ఇంటర్నెట్​ వేగానికే పరిమితం కాలేదన్నారు. ప్రభుత్వ సేవలు, సుపరిపాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ఇదే వేదికపై 2022 లో దేశంలోని 5 జీ నెట్ వర్క్​ సేవలు ప్రారంభించామని మోదీ (PM Modi) గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలోని ప్రతి జిల్లాకు 5 జీ సేవలు విస్తరించాయని.. 5.5 లక్షలకు పైగా 5జీ బేస్​ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే ఇంటర్నెట్​ స్పీడ్​ పది రేట్లు పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ సాంకేతిక రంగానికి భారత దేశం వేదిక కావాలని.. మొబైల్ టెక్నాలజీని శాసించాలని మోదీ ఆకాంక్షించారు.

Also Read : ఢిల్లీ ప్రొటెస్ట్‌లో పొలిటికల్ హీట్: రాహుల్ ప్రవర్తనపై వివాదం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>