భారత్‌లో స్టార్​ లింక్‌కు అడ్డుకట్ట.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు..!

కలం, వెబ్​ డెస్క్​ : భారత్​ లో స్టార్​ లింక్​ కు అడ్డుకుంటున్నారని స్పెస్​ ఎక్స్​ అధినేత ఎలాన్​ మస్క్​ (Elon Musk) సంచలన ఆరోపణలు చేశారు. భారత్​ లో స్టార్ లింక్​ లాంచ్​ చేయడానికి కొందరు పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవని సోషల్​ మీడియాలో వచ్చిన కథనాలకు మస్క్ స్పందించారు. నాణ్యమైన బ్రాండ్ సేవలను ప్రజలకు అందించకుండా బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

‘దురదృష్టవశాత్తు, భారత ప్రజలపై తమ ఏకస్వామ్య పట్టును కొనసాగించడం కోసం కొంతమంది కుబేరులు మనల్ని అడ్డుకుంటున్నారు. వారెవరో మీరే ఊహించగలరు. ఇది భారత ప్రజలపై జరిగిన నేరం’ అని ఎక్స్​ వేదికగా ఎలాన్ మస్క్ (Elon Musk)​ ట్వీట్​ చేశారు. మస్క్​ ట్వీట్​ పై బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ స్పందించారు. భారత్​ మార్కెట్​ లో స్వతంత్ర మార్కెట్​ ను దెబ్బతీస్తున్న బడా వ్యాపారస్తుల పేర్లను వెల్లడించాలని ఆయన కోరారు. దేశ ప్రజల ప్రయోజనాలను, వినియోగదారుల హక్కులను కాలరాస్తున్న వారి అసలు రూపాలను బహిర్గతం చేయాలని కేటీఆర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>