కలం, వెబ్ డెస్క్ : గతేడాది కురిసిన అకాల వర్షాలతో పాటు మొంథా తుఫానుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన (Crop Loss Compensation) రైతులకు ఎకరానికి రూ.10 వేలు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటికీ సుమారు 24 వేల మంది రైతులకు పరిహారం అందలేదు. వీరికి ఒక్కో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రూ.24 కోట్లకు పైగా సాయం అందాల్సి ఉన్నది.
నాలుగు నెలలు గడిచినా పంట నష్ట పరిహారం అందకపోవడంతో అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. దీంతో తాజాగా పంట నష్టపరిహారం చెల్లింపులపై తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రశ్న లేవనెత్తారు. ఈ మేరకు ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. ఆగస్టు నెలలో కురిసిన అకాల వర్షాలతో 27 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో దాదాపు 78వేల మంది రైతులు పంట నష్టపోయారు.
వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.122 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని విడుదల చేసింది. అలాగే, ఆగస్టులో మొంథా తుఫాను ఎఫెక్టుతో 27 జిల్లాల్లో దాదాపు లక్షా ఇరవై ఏడు వేల మంది రైతులు పంట నష్టపోయారు. బాధితులకు మొత్తం రూ.109 కోట్లకు పై చిలుకు పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది.
అయితే, నాలుగు నెలలు గడుస్తున్నా పంట నష్టపరిహారం అందని అన్నదాతలు వేల సంఖ్యలో ఉన్నారు. 24,592 మంది రైతులకు చెందిన 24,138.19 ఎకరాల పంట నష్టం జరిగింది. ఒక్కో ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.24,13,81,892 కోట్లు ఇంకా అందలేదు. Crop Loss Compensation కు సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
Read Also: కలుషిత నీటి నివారణకు రొబోటిక్ టెక్నాలజీ
Follow Us On: X(Twitter)


