కలం, వెబ్ డెస్క్ : జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. నానక్ రామ్ గూడలో ఈగల్ టీమ్ దాడులు చేయగా.. ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. నార్సింగి పోలీసుల టెస్టుల్లో సుధీర్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి డీ అడిక్షన్ సెంటర్ కు తరలించారు పోలీసులు. సుధీర్ రెడ్డి గతంలోనూ రెండుసార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు.
సుధీర్ రెడ్డి కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నాడని ఆయన ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈగల్ టీమ్ దాడుల్లో ఇప్పటికే చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ అరెస్ట్ అవుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నియంత్రణ కోసం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: అమరావతి రెండో విడత భూసేకరణ ప్రారంభం..
Follow Us On : WhatsApp


